సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2023 (13:24 IST)

రాయచూరు ఎన్నికల ప్రచారకర్తగా సినీ దర్శకుడు రాజమౌళి

ssrajamouli
కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలో ఓటింగ్ శాతం పెంపునకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఎన్నికల ప్రచారకర్తగా ఎస్ఎస్ రాజమౌళిని ఎన్నికల సంఘం సిఫార్సు చేయగా, ఆయన కూడా సమ్మతించినట్టు సమాచారం. ఓటు హక్కు విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకునిరావాలని నిర్ణయించారు. అందుకు రాజమౌళి సరైన వ్యక్తి అని భావించిన ఎన్నికల సంఘం ఆయన్ను ఎన్నికల ప్రచారకర్తగా భావించినట్టు నాయక్ తెలిపారు.
 
సినీ దర్శకుడు రాజమౌళి పేరును రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సిఫార్సు చేశామని రాజమౌళి కూడా అందుకు అంగీకరించారని తెలిపారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకాలోని అమరేశ్వర క్యాంపులోనే రాజమౌళి జన్మించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆయనతో ప్రచారం చేయిస్తే పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులోభాగంగా, రాజమౌళి ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతో పాటు వీడియో సందేశాల ద్వారా ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తారు.