గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (22:32 IST)

ప్రభాస్‌, హృతిక్‌ కాంబినేషన్‌లో సినిమా

Hitrik, prabhas
హీరో ప్రభాస్ లాక్‌డౌన్ త‌ర్వాత సినిమాల షూటింగ్‌లో బిజీగా వున్నారు. ‘రాధే శ్యామ్‌’ చిత్రం జులై 30న ప్రేక్షకు ముందుకు రానుంది. `సలార్‌, ఆదిపురుష్`‌ చిత్రాలు వచ్చే ఏడాది విడుదకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ఈ ఏడాది సమ్మర్‌లో సెట్స్‌ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు చాలా డేట్స్ కావాల్సి వుంద‌ని ఇటీవ‌లే నాగ్ అశ్విన్ చెప్పాడు.

ఈ మూవీని సైంటిఫిక్‌ థ్రిల్ల‌ర్‌గా భారీ బడ్జెట్‌తో హాలీవుడ్‌ రేంజిలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ పూర్తయ్యాక ప్రభాస్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో హతిక్‌ రోషన్‌తో కలిసి స్టైలిష్‌ యాక్షన్‌ థ్ల్రిర్‌ చేయనున్నట్టు సమాచారం. వార్‌, బ్యాంగ్‌ బ్యాంగ్‌ ఫేమ్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించ‌నుంది.