1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (22:55 IST)

ముంబైలో మ‌కాం పెడుతున్న ప్ర‌భాస్‌!

Prabhas Raju
అవునండి. ప్ర‌భాస్ ముంబైకి మ‌కాం మార్చేస్తున్నాడు. ఆ అంటే ఊ. అంటే ముంబై వెళ్ళాల్సి వ‌స్తుందట‌. అలాగ‌ని అనుష్క కోసం అనుకుంటే పొర‌పాటే. బాహుబ‌లి త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు క‌దా. ఆ సినిమా టైంలోనే మోడిని కూడా కృష్ణంరాజుతో క‌లిసి వ‌చ్చాడు. దాంతో ప్ర‌భాస్‌కు బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు వ‌చ్చిప‌డుతున్నాయి. తాజాగా ఆదిపురుష్ సినిమా బాలీవుడ్ నిర్మాత‌లే తీస్తున్నారు. అది కూడా హిందీలోనే కానీ తెలుగులో డ‌బ్ అవుతుంది. ప్ర‌భాస్ వున్నాడుకాబ‌ట్టి తెలుగు సినిమా అనుకుంటే పొర‌పాటే.

ఇదిలా వుండ‌గా, బాలీవుడ్ నుంచి వ‌చ్చిన హీరోయిన్లు ఇక్క‌డ బిజీగా మార‌డంతో హైద‌రాబాద్‌లో సొంత ఇల్లు కొనేసుకుంటున్నారు. అందులో అనుష్క కూడా మొద‌ట జూబ్లీహిల్స్‌లోనే కొనేసింది. అప్ప‌టికీ ప్ర‌భాస్‌తో స‌న్నిహితంగా వుండేది. తాజా స‌మాచారం ప్ర‌కారం ముంబైలో ఎక్కువ భాగం త‌న సినిమాలు షూటింగ్ జ‌ర‌గ‌డంతోపాటు డ‌బ్బింగ్ వంటి ప‌నుల‌కు ముంబై త‌ర‌చూ వెళ్ళాల్సిరావ‌డంతో ప్ర‌భాస్ అక్క‌డే స్వంత ఇల్లును కొనుగోలుచేసే ప‌నిలో వున్నాడు. ఇందుకు ఆయ‌న సోద‌రుడు ద‌గ్గ‌రుండి ప‌నులు చూసుకుంటున్నాడు. ఈ విష‌యంలో ఆదిపురుష్ నిర్మాత‌ల్లో ఒక‌రైన భూషణ్ కుమార్‌ ప్ర‌భాస్‌కు ఇల్లు చూసే బాధ్యత ఆయ‌నే తీసుకున్నాడ‌ట‌. అది ఎన్ని కోట్లు ఖ‌రీదు చేస్తుందో త్వ‌ర‌లో తెలియ‌నుంది.