మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (23:22 IST)

మహారాష్ట్రలో కరోనా ఉధృతి.. ఎనిమిది వేలకు చేరిన కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి మరింతగా వ్యాప్తిస్తుంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఎనిమిది వేలకు చేరింది. గత నాలుగు రోజులుగా కొత్త కేసులు 8 వేలకు పైగా నమోదయ్యాయి. 
 
శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 8,623 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,46,777కు, మరణాల సంఖ్య 52,092కు చేరింది.
 
మరోవైపు గత 24 గంటల్లో 3,648 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 72,530 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, కరోనా కేసుల నమోదు ఎక్కువగా ఉన్న అమరావతి, అచల్‌పూర్‌లో లాక్‌డౌన్‌ను మార్చి 8 వరకు పొడిగించారు.