గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 7 జులై 2021 (15:02 IST)

సినిమా టిక్కెట్ ధ‌ర ఎంతైనా ఉండొచ్చు...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై నియంత్రణ ఎత్తేసింది. సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపు మీద ఇచ్చిన ఆదేశాల‌ను రాష్ట్ర ప్రభుత్వం వెన‌క్కి తీసుకుంది. జులై 8 నుంచి ఏపీలో ధియేట‌ర్లు తెరుచుకోనున్నాయి.

కోవిడ్ రెండో అల త‌గ్గ‌డంతో సినిమా థియేట‌ర్లు తెర‌వాల‌ని నిర్ణ‌యించారు. దీనితో  రేపటి నుండి తెరుచుకోనున్న థియేటర్లలో టికెట్ల రేట్లు, ఎప్పటి కప్పుడు ప్రభుత్వం సమీక్షించి ధరలని నిర్ణయిస్తుంది, టికెట్ ధర ఇంతే ఉండాలి అనే నియమం ఏదీ లేదు.

ఎప్పటి కప్పుడు ధరల మీద నిర్ణయం తీసుకుంటారు. గ‌తంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిన‌పుడు ధ‌ర‌ల‌ను నియంత్రిస్తూ, ఏపీ ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. ఇపుడు దానిని ఉప‌సంహ‌రిస్తూ, ధ‌ర‌ల నియంత్ర‌ణ‌ను ఎత్తివేశారు.