సంబంధిత వార్తలు
- Ravichandran Ashwin: ధోనీ ఇచ్చిన గిఫ్ట్‌కి జీవితంలో మరిచిపోలేనిది..
- ఎంఎస్ ధోని, సాక్షి సింగ్ ధోనిలతో జతకట్టిన గార్నియర్ బ్లాక్ నేచురల్స్
- సందీప్ రెడ్డి వంగా ఆవిష్కరించిన సంతాన ప్రాప్తిరస్తు టీజర్
- చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ : తొలిసారథిగా నయా రికార్డు!
- స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ధోనీ! (Video)
తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'యూనిమల్' సినిమాతో పాన్ ఇండియా దర్శకుడుగా మారిపోయారు. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ మూవీ భారీ వసూళ్లతో సాండీ స్థాయిని అమాంతం పెంచేసింది. దీంతో ఆయన ప్రభాస్‌తో తీయబోయే "స్పిరిట్" చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలావుంటే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ నటించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ ప్రకటన తాలూకూ వీడియో అది. వీడియోలో 'యూనిమల్' సినిమాలో హీరో రణబీర్ క్యారెక్టర్‌లో ధోనీ సైకిల్‌పై రావడాన్ని సందీప్ రెడ్డి చిత్రీకరించడం మనం చూడొచ్చు.
కాగా, ఈ యాడ్‌కు సంబంధించిన పూర్తి వీడియో త్వరలోనే బయటకు రానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమోలే మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఎంఎస్‌డీ, సాండీ కాంబోలోని యాడ్ తాలూకూ ప్రోమోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
DHONI AS ANIMAL...!!!!
— Johns. (@CricCrazyJohns) March 18, 2025
- MS Dhoni & Sandeep Reddy Vanga in an Ad Collaboration ???????? pic.twitter.com/PyeLvof93F
