శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 19 మే 2023 (19:58 IST)

ఎన్‌.టి.ఆర్‌. బర్త్‌డే సందర్భంగా దేవర టైటిల్‌ తో పాటు లుక్ వచ్చేసింది

NTR llok
NTR llok
గత కొద్దిరోజులుగా ఎన్‌.టి.ఆర్‌. జూనియర్‌ నటిస్తున్న సినిమాకు దేవర అనే టైటిల్‌ రానున్నదని సోషల్‌ మీడియాలో వార్త వచ్చింది. దానికి అనుగుణంగానే ట్విట్టర్‌లో రోజుకొకి అప్‌డేట్‌ పోస్టర్‌తో అభిమానులను ఉర్రూతలూరించారు. కత్తులతో పోస్టర్‌లను చూపిస్తూ భారీ యాక్షన్‌ సినిమాగా చూపించేశారు. ఈ కథ సముద్రంలో జరిగే దొంగలతో జాలరికి చెందిన ఓ వ్యక్తి చేసే పోరాటంగా దర్శకుడు కొరటాల శివ చెప్పకనే చెప్పేశాడు.
 
రేపు అనగా మే 20న ఎన్‌టిఆర్‌. జన్మదినం. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం 7గంటల తర్వాత టైటిల్‌ను ఖరారుచేస్తూ ఎన్‌.టి.ఆర్‌. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. సముద్రంలోని రాళ్ల దగ్గర గండ్ర గొడ్డలి లాంటి కత్తి పట్టుకుని సీరియస్ గా చూస్తున్న ఎన్‌.టి.ఆర్‌. స్టిల్ ను పోస్ట్ చేశారు. 

జాహ్నవి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో బ్యాక్‌గ్రౌండ్‌సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. యాక్షన్‌ పరంగా అనుభజ్ఞులైన యాక్షన్‌ కొరియోగ్రాఫర్లతో అందులోనూ హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ కూడా పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది 5.4.2204న సినిమా విడుదల చేయనున్నట్లు పోస్టర్‌లో చెప్పేశారు.