సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 18 మే 2023 (22:10 IST)

చిన్న-మధ్యతరహా వ్యాపారులను బలోపేతం చెయ్యడానికి మై బిల్ బుక్ నుంచి 10 పవర్‌ఫుల్ ఫీచర్స్

Billbooks
చిన్న- మధ్యతరహా వ్యాపారాల్లో అక్కౌంటింగ్ పరిష్కారాల కోసం భారతదేశపు ప్రముఖ జీఎస్టీ బిల్లింగ్, అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అయిన మై బిల్ బుక్ అద్భుతమైన మెగా అప్ డేట్ ను అందిస్తోంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాన్ని సులువుగా నిర్వహించేందుకు వీలుగా తన ఫ్లాట్ ఫార్మ్ లో 10 అద్భుతమైన కొత్త ఫీచర్లను ప్రారంభించింది మై బిల్ బుక్. వ్యాపారాన్ని మరింత సులభంగా మరియు సమర్ధవంతంగా నిర్వహించడంలో చిన్న మధ్య తరహా వ్యాపారాలకు సహాయం చేయడానికి ఈ కొత్త ఫీచర్లు రూపొందించబడ్డాయి. ఇవి ఇన్‌వాయిస్, అకౌంటింగ్, పేరోల్, మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్ అవసరాలను నిర్వహించడానికి సమగ్రమైన సాధనాలను అందిస్తాయి. ఈ చేర్పులతో, మై బిల్ బుక్ అనేది చిన్న, మధ్య తరహా వ్యాపారాల కోసం వన్-స్టాప్ సొల్యూషన్‌గా దాని స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. అంతేకాకుండా కొన్ని క్లిష్టమైన కార్యకలాపాలను పరిష్కరించడానికి మరియు భారతదేశంలోని వ్యాపారాలు అన్నీ డిజిటలైజేషన్‌ను ప్రారంభించేందుకు ఈ యాప్ ఎంతో దోహదపడుతుంది.
 
మూడేళ్ల కిందట ప్రారంభమైన ఫ్లోబిజ్ వారి మైబిల్ సాఫ్ట్వేర్ యాప్ బుక్ దేశంలోని 70 లక్షల వ్యాపారులకు డిజిటలైజేషన్ ద్వారా తమ రోజువారీ కార్యకలాపాల్ని ఎక్కడి నుంచి అయినా నిర్వహించడానికి సహాయపడుతుంది. కస్టమర్ కే తొలి ప్రాధాన్యం లక్ష్యంతో రూపొందించిన మై బిల్ బుక్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పాటు..  డెస్క్‌టాప్‌లో కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు, దీన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు, ఏ పరిస్థితుల్లోనైనా వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. జీఎస్టీ/నాన్-జీఎస్టీ బిల్లింగ్, ఈ-వే బిల్లింగ్, పిఓఎస్ బిల్లింగ్, ఈ-ఇన్‌వాయిసింగ్ వంటి అధునాతన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. మైబిల్ బుక్ యాప్ తో ప్రతి నెలా చిన్న-మధ్య తరహా వ్యాపారాలు ఇప్పటికే రూ. 12,500 కోట్ల విలువైన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
 
మై బిల్ బుక్ ద్వారా పరిచయం అయిన కొత్త ఫీచర్స్ అన్నీ కంపెనీ లక్ష్యం అయినటువంటి "బిల్టింగ్ ఫర్ భారత్ " నినాదానికి అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఈ ఫీచర్‌లు భారతీయ చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు సరిపోయే విధంగా రూపొందించబడ్డాయి. దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. అంతేకాకుండా ఇది శక్తివంతమైనది, వివిధ రకాల వినియోగ అవసరాలను తీరుస్తుంది. ఇక ఇందులో ఉన్న ప్రధాన ఫీచర్స్ ని ఒకసారి గమనిస్తే...
 
వాట్సాప్ మార్కెటింగ్: వినియోగదారులు ఇప్పుడు వాట్సాప్‌లో బల్క్ మార్కెటింగ్ క్యాంపెయిన్‌ల ద్వారా తమ వ్యాపారాలను ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ ప్రచారాల పెట్టుబడిపై రాబడిని విశ్లేషించవచ్చు. ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న సులభమైన టెంప్లేట్‌లు చిన్న వ్యాపార యజమానులు ఇచ్చే డిస్కౌంట్‌లు, ప్రమోషన్‌లు, సీజనల్ సేల్స్ మరియు పండుగలు వంటి వివిధ కార్యకలాపాలను ప్రకటించడానికి మరియు ప్రచారం చేయడానికి వీలు కల్పిస్తాయి.
 
స్టాఫ్ అటెండెన్స్ మరియు పేరోల్ మేనేజ్‌మెంట్: ఇది ఒక ప్రత్యేకమైన ఫీచర్. వ్యాపార యజమానులు తమ ఉద్యోగుల హాజరును గుర్తించడానికి, ముందస్తు చెల్లింపులను చేయడానికి మరియు సిబ్బంది పేరోల్‌ని నిర్వహించడానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది.
 
ఆటోమేటెడ్ బిల్లులు: చిన్న, మధ్య తరహా వ్యాపారులు ఇప్పుడు తమ క్లయింట్‌లకు రిటైనర్-రకం సేవల కోసం పునరావృత ఇన్‌వాయిస్‌లను సెటప్ చేయగలవు. తద్వారా ప్రతి నెలా మాన్యువల్ గా ఇన్‌వాయిస్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది వ్యాపార యజమానులకు చాలా సమయాన్ని మాత్రమే కాకుండా లోపాలు మరియు వ్యత్యాసాలను తొలగించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇందుకోసం వినియోగదారులకు అందించాల్సిన సేవలు, ఫ్రీక్వెన్సీ మరియు రిమైండర్ షెడ్యూల్‌ను సెట్ చేయాల్సి ఉంటుంది.తద్వారా ఈ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా ప్రొఫెషినల్ ఇన్‌వాయిస్‌లను ఉత్పత్తి చేయడం,వినియోగదారులు మరియు క్లయింట్‌లకు షేర్ చేయడం లాంటివి చేస్తుంది.