సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (15:55 IST)

ఐటెం సాంగ్ కు సిద్ధం అవుతున్న నభానటేష్!

Nabhanatesh
Nabhanatesh
మోడల్, నర్తకి, నటి అయిన నభానటేష్ పలు సినిమాలో నటించింది. రామ్ పోతినేని తో ఇస్మార్ట్ శంకర్ లో స్పీడ్ గా ఉండే అమ్మయిగా నటించింది. అల్లుడు అదుర్స్, మాస్ట్రో సినిమాలలో  చూపించిన నభానటేష్ సోషల్ మీడియాలో చాల ఆక్టివ్ గా ఉంటుంది. తన అందాలతో యువతను ఆకట్టుకుంటుంది. ఆ మధ్య గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధం అని తెలిపింది. తాజాగా ఓ సినిమాలో నటించబోతుంది. 
 
Nabhanatesh
Nabhanatesh
ఇక ఈ వేసవిలో వెకేషన్ కు ఓ ప్రదేశానికి వెళ్ళింది. ప్రశాంతంగా ఉన్న ఆ ప్లేసులో పుస్తక పఠనం చేస్తూ, ఫ్రూట్స్ తింటూ ఊరిస్తుంది.  మరిన్ని అప్ డేట్స్ రాబోతున్నాయని హింట్ ఇచ్చింది. గ్లామర్‌ తో పాటు డాన్స్ బేస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. ఐటెం సాంగ్ లో చూడాలని ఉందని కొందరు నెటిజన్స్ కొంటెగా అడిగారు. వారికి లవ్ యూ సింబల్ తో అంటే కొంటెగా చెప్పింది.