మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్???

nagababu
ఠాగూర్| Last Updated: సోమవారం, 14 సెప్టెంబరు 2020 (19:31 IST)
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక ప్రముఖులు కరోనా వైరస్ బారిపడుతున్నారు. తొలుత ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, నేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇలా అనేక మంది ప్రముఖులు ఈ వైరస్ బారినపడ్డారు. ఆ తర్వాత అనేక మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు.

ఇపుడు మెగా బ్రదర్ నాగబాబు ఈ వైరస్ బారిపడ్డారు. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చిన నాగబాబు... కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

కాగా, నాగ‌బాబు తెలుగు టెలివిజ‌న్‌లో ఒక షో న‌డుతున్న విషయం తెల్సిందే. అంతేకాదు అత‌ను త‌న కుమార్తె నిహారికాతో ఓ ఇంట‌ర్వూ కూడా చేశారు. షూట్ స‌మ‌యంలోనే అత‌నికి వైర‌స్ సోకి వుంటుందని భావిస్తున్నారు. అలాగే అనేక‌మంది తెలుగు టీవీ తార‌లు, ప్ర‌ముఖుల షూట్‌లో పాల్గొన‌డం వ‌ల్ల క‌రోనా బారిన ప‌డ్డారు.దీనిపై మరింత చదవండి :