శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జులై 2018 (18:32 IST)

తెరపై దంపతులుగా సమంత-చైతూ... ముహూర్తం కుదిరింది?

టాలీవుడ్ ప్రేమపక్షులు ప్రస్తుతం దంపతులైన సమంత, చైతూ.. పెళ్లికి తర్వాత కలిసి నటించనున్నారు. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ముచ్చటపడుతున్నారు. అలాంటి కథ కోసం వెయిట్ చేస్తూ వస్తోన్న

టాలీవుడ్ ప్రేమపక్షులు ప్రస్తుతం దంపతులైన సమంత, చైతూ.. పెళ్లికి తర్వాత కలిసి నటించనున్నారు. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ముచ్చటపడుతున్నారు. అలాంటి కథ కోసం వెయిట్ చేస్తూ వస్తోన్న ఈ జంటకు, తాజాగా ఒక మంచి కథ దొరికేసింది. దర్శకుడు శివ నిర్వాణ వినిపించిన కథ నచ్చడంతో సమంత .. చైతూ ఓకే చెప్పేశారు.
 
ఈ చిత్రంలోనూ సమ్మూ-చైతూ భార్యాభర్తలుగా కనిపిస్తారట. సాహు, హరీశ్ నిర్మాతలుగా వ్యవహరించే ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఆ తరువాత నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, రావు రమేష్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం సమకూర్చుతున్నాడు.