శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : బుధవారం, 18 జులై 2018 (15:20 IST)

'జంబలకిడి పంబ' పడుకోబెడితే... RX 100 లేపి నిలబెట్టింది... ఏంటి సంగతి?

RX 100 చిత్రాన్ని యూత్ వేలంవెర్రిగా చూస్తున్నారు. ఈ చిత్రం దెబ్బకు చిరంజీవి చిన్నల్లుడు విజేత కూడా వణుకుతున్నట్లు సినీ జనం చెప్పుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... శ్రీనివాస రెడ్డి హీరోగా జంబలకిడ

RX 100 చిత్రాన్ని యూత్ వేలంవెర్రిగా చూస్తున్నారు. ఈ చిత్రం దెబ్బకు చిరంజీవి చిన్నల్లుడు విజేత కూడా వణుకుతున్నట్లు సినీ జనం చెప్పుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... శ్రీనివాస రెడ్డి హీరోగా జంబలకిడి పంబ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందేగా. ఈ చిత్రాన్ని నిర్మించిన రవి ఘోరంగా నష్టపోయాడు. దాదాపు రూ. 3 కోట్ల మేర నష్టపోయాడు. ఈ సమయంలో అతడికి RX 100 చూపించారు. 
 
సినిమా పైన వున్న నమ్మకంతో ఆ చిత్రాన్ని కొనుగోలు చేసి అన్ని ఏరియాలు విడుదల చేశాడు. ట్రైలర్లోనే యువతను కిక్కెక్కించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుట్ అందాలను చూసేందుకు యువత ఎగబడ్డారు. మరోవైపు చిత్రంలోని పాయింట్ బాగా కనెక్ట్ కావడంతో ఈ చిత్రం బీభత్సమైన కలెక్షన్లను రాబట్టింది. దీనితో తొలి వారంలోనే ఏకంగా రూ. 9 కోట్లను లాగి కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీనితో నిర్మాత రవి పోగొట్టుకున్న రూ. 3 కోట్లకు మూడింతలు డబ్బులు వచ్చిపడ్డాయి. అదృష్టం అంటే అదేమరి.