బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (11:13 IST)

ప్రారంభమైన నాగ చైతన్య - శోభిత వివాహ వేడుకలు - వైభవంగా హల్దీ వేడుకలు

shobhita
అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలైంది. హీరో అక్కినేని నాగార్జున, శోభితల వివాహం వచ్చే నెల నాలుగో తేదీన జరుగనుంది. ఈ క్రమంలో తాజాగా హల్దీ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ హల్దీ వేడుకల్లో భాగంగా కాబోయే వధూవరులకు మంగళస్నానాలు చేయించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య, శోభితల వివాహం జరుగనున్న విషయం తెల్సిందే. దీనిపై ఇటీవలే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ ఎలాంటి ఆర్భాటాలకు తావివ్వకుండా సాదాసీదాగా తన వివాహం జరుగుతుందన్నారు. 
 
పైగా, అన్నపూర్ణ స్టూడియో తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమనైనదన్నారు. స్టూడియోలోని తన తాతాగారి విగ్రహం ముంు పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పారు. ఆయన ఆశీస్సులు తమపై ఎల్లపుడూ ఉండాలనే ఉద్దేశ్యంతో ఇరు కుటుంబాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. శోభిత తనను బాగా అర్థ చేసుకుందని, ఆమెతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని వివరించారు.