శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి వెంకటరమణ
Last Modified: శుక్రవారం, 27 డిశెంబరు 2019 (18:17 IST)

నాకా విషయం చిరాకుగా వుందని అమ్మ ముందే చెప్పేసిన యంగ్ హీరో-video

ఛలో సినిమాతో మంచి హిట్ సాధించిన యంగ్ హీరో నాగశౌర్య తొలిసారిగా పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా మారడంతో పాటుగా తానే స్వయంగా కథ రాసుకుని, సొంత బ్యానర్‌లో ‘అశ్వత్థామ’ అనే సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా రమణ తేజ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. జ‌న‌వ‌రి 31న విడుద‌ల‌ కానున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు.
 
రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో శుక్రవారం నిర్వహించిన ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో నాగశౌర్య, సమర్పకుడు శంకర్ ప్రసాద్ ముల్పూరి, నిర్మాత ఉషా ముల్పూరి, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, దర్శకుడు రమణ తేజ, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ మనోజ్ రెడ్డి, బి.వి.యస్.రవి, ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తనయుడు యతీష్ పాల్గొన్నారు.
 
కార్యక్రమంలో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి రఫ్‌గా ఉండే నాకు లవర్ బోయ్ ట్యాగ్ రావడం చిరాకుగా అనిపించింది. అందుకే పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తున్నానని తెలిపారు.