శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (17:37 IST)

పూర్తి వినోదాత్మక చిత్రంగా నమో : దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bheemaneni Srinivasa Rao, Viswanth Duddampudi, Anuroop Katari
Bheemaneni Srinivasa Rao, Viswanth Duddampudi, Anuroop Katari
పూర్తి వినోదాత్మక చిత్రంగా ‘నమో’ను తెరకెక్కిస్తున్నారు.  విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా, విస్మయ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ.ప్రశాంత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. శనివారం నాడు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆయన ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ..* ‘ఆదిత్య నా దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు. ఎంతో సిన్సియర్‌గా పని చేస్తాడు. రెండు మూడేళ్లు నా దగ్గర ఎంతో అకింతభావంతో పని చేసాడు. అతను ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. ఏదో చేయాలని, నేర్చుకోవాలన్న తపన ఉంటే అవకాశాలు వస్తాయి. నమో అనే పేరు వినగానే.. నరేంద్ర మోదీ గారి మీద కథ అనుకున్నా. నగేష్, మోహన్ హీరోల పాత్రల పేర్ల మీద టైటిల్ పెట్టానని తెలిపాడు. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
ఆదిత్య రెడ్డి కుందూరు మాట్లాడుతూ,  నా కథను ఒప్పుకున్న మా హీరో విశ్వంత్‌, హీరోయిన్ విస్మయకు థాంక్స్. మా సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సినిమాను చూసి హాయిగా నవ్వుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
 
హీరో విశ్వంత్ దుద్దంపూడి మాట్లాడుతూ, ఇదొక డిఫరెంట్ చిత్రం. మా డైరెక్టర్ ఆదిత్య డిఫరెంట్ కథను రాసుకున్నారు. ఎంతో వేగంగా సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాకు పూర్తి క్రెడిట్ మా దర్శకుడికే ఇవ్వాలి. ఈ నమోను మున్ముందు సిరీస్‌లుగా కూడా తీయొచ్చు. త్వరలోనే మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
అనురూప్ కటారి మాట్లాడుతూ, ఈ రోజు పోస్టర్, టైటిల్ లాంచ్ చేశాం. ఈ రోజే మేం సినిమా గురించి పూర్తిగా చెప్పలేం. నాకు అవకాశం ఇచ్చిన ఆదిత్యకు థాంక్స్. విశ్వంత్ ఈ సినిమా తరువాత ఇంకా బిజీ అవుతారు. ఈ మూవీ ట్యాగ్ లైన్ ఫుల్ వైరల్ అవుతుంది’ అని అన్నారు.
 
హీరోయిన్ విస్మయ మాట్లాడుతూ, మా సినిమాలో ఫుల్ ఫన్ ఉంటుంది. విశ్వంత్ చాలా బాగా నటించారు. అనురూప్ పాత్ర బాగుంటుంది. నాకు సహకరించిన చిత్రయూనిట్‌కు థాంక్స్’ అని అన్నారు.