సోమవారం, 4 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (16:37 IST)

ప్రధానికి సచిన్ అరుదైన జెర్సీ గిఫ్ట్.. టీషర్ట్ వెనుక "నమో" అని..

Modi
Modi
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన బహుమతిని అందేజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వనాథుడు కొలువై ఉన్న వారణాసిలో నూతన క్రికెట్ స్టేడియానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. 
 
ఈ కార్యక్రమానికి ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షాతో పాటు లెజెండరీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి తదితరులు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సచిన్ అరుదైన బహుమతిని అందజేశారు. భారత క్రికెటర్ల సంతకాలతో కూడిన జెర్సీని మోడీకి మాస్టర్ గిఫ్ట్​గా ఇచ్చారు. 
 
ఈ టీషర్ట్ వెనుక "నమో" అని రాసి ఉండటం విశేషం. సచిన్​తో పాటు జై షా, రోజర్ బిన్నీ కూడా ప్రధానికి బహుమతి అందజేశారు. సంతకాలతో కూడిన ఒక స్పెషల్ బ్యాట్​ను మోడీకి ఇచ్చారు.