గురువారం, 10 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (11:17 IST)

వారణాసి: డమరుకం ఆకారంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

stadium
stadium
వారణాసిలోని గంజారిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపుదిద్దుతోంది. ఈ స్టేడియం నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. క్రికెట్ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమానికి బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్వి జై షా హాజరవుతారు. 
 
శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మోదీ వారణాసి చేరుకుంటారు. కొత్తగా నిర్మించిన 16 అటల్ రెసిడెన్షియల్ స్కూళ్లను కూడా ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్, లక్నోలో ఇప్పటికే రెండు క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. ఇది మూడోది కానుంది. 
 
ఇకపోతే ఈ స్టేడియం నిర్మాణానికి దాదాపు రూ.330 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్టేడియంపైకప్పు అర్ధ చంద్రాకారంలో, ఫ్లడ్‌లైట్లు త్రిశూలం, కొన్ని నమూనాలను బిల్వ పత్రాలను పోలి వుండేలా నిర్మిస్తారు. అలాగే, ఓ నిర్మాణాన్ని డమరుకం ఆకారంలో నిర్మించనున్నారు. మొత్తంగా ఈ స్టేడియం కాశీ క్షేత్ర సారాన్ని ప్రతిబింబిస్తుంది. డిసెంబరు 2025 నాటికి పూర్తవుతుంది.