సచిన్ పేరిటవున్న అత్యధిక శతకాల రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ!!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 50 ఓవర్ల పరిమిత వన్డే క్రికెట్‌లో అత్యధికంగా 49 శతకాలు చేయగా, ఇపుడు ఈ రికార్డుపై భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నేశాడు. సచిన్ తన కెరీర్‌లో మొత్తం 463 మ్యాచ్‌లు ఆడి 49 సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ కేవలం 278 మ్యాచ్‌లలోనే 47 సెంచరీలు చేసి మరో రెండు సెంచరీల దూరంలో ఉన్నాడు. అటు టెస్టులు, ఇటుు వన్డేలను కలుపుకుంటే విరాట్ కోహ్లీకి ఇది 77వ అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం.
అలాగే, ఆసియా కప్ టోర్నీలో భారత్ తరపున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు మొత్తం 4 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోగా, ఆ తర్వాత స్థానాల్లో సురేశ్ రైనా, నవజ్యోత్ సింగ్ సిద్ధూలు ఉన్నారు. వీరిద్దరూ మూడేసి మార్లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
అలాగే, కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆయన ఆయన 13 వేల పరుగుల మైలురాయిని అధికమించాడు. మొత్తం 277 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. సచిన్ మాత్రం 321 ఇన్నింగ్స్‌లలో 13 వేల పరుగులు చేశాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ (341) మూడో స్థానంలో ఉన్నాడు.