తొలి విడతదగా 500 ఆక్సిజన్ లను అందజేసిన నమ్రత
కరోనా కాలంలో ఆక్సిజన్ అందక ఇబ్బందిపడుతున్న వారిని సాయం చేసేవారిలో నమ్రత శిరోద్కర్ చేరింది. ఇప్పుడు నమ్రత 500 ఆక్సిన్ కాన్‌సన్‌ట్రేటర్లను అవసరం నిమిత్తం ముంబైకు పంపించింది. ఇది మొదటి విడత అని తెలియజేసింది. ఈ విషయాన్ని తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అత్యవసర పరిస్థితికి ఈ ఆక్సిజన్ సాంద్రతలు అవసరమయ్యే కోవిడ్ పాజిటివ్ రోగులు మమ్మల్ని 8451869785 కు కాల్ చేయవచ్చు, లేదా టేగ్ చేయవచ్చని తెలిపింది.
అదేవిధంగా అక్కడ ఆమెకు సంబంధించిన టీమ్ కొందరు వున్నారు. వారి సాయంతో అక్కడ అవసరమైన వారికి అందజేసే పనిలో వున్నారు. ఈ ఆక్సిజన్ సాంద్రతలను ఉచితంగా అందజేస్తున్నాం. వాటిని ఉపయోగించిన తర్వాత దయచేసి తిరిగి ఇవ్వగలరు అని పోస్ట్ చేసింది. దీనికి ఇప్పటికే ఆమెకు మంచి స్పందన లభించింది. మంచి పని చేస్తున్నారని కొందరు నెటిజర్లు శుభాకాంక్షలు తెలియజేశారు.