శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (19:39 IST)

ట్రూకాలర్‌లో కొత్త ఫీచర్.. మహిళలు, చిన్నారుల సేఫ్టీ కోసం గార్డియన్స్​​-సేఫ్టీ ఆన్​ ది మూవ్

true caller
''ట్రూకాలర్'' యాప్ గురించి అందరికీ తెలిసిందే. ఈ యాప్​ చాలా తక్కువ సమయంలో ఎక్కువ డౌన్​లోడ్స్ సాధించి మోస్ట్​ పాపులర్​ యాప్​గా నిలిచింది. ఇక, ట్రూకాలర్​ ఎప్పటికప్పుడు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. తాజాగా, యూజర్​ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ట్రూ కాలర్ సరికొత్త యాప్​ విడుదల చేసింది. 
 
'గార్డియన్స్​​-సేఫ్టీ ఆన్​ ది మూవ్' పేరుతో పర్సనల్​ సేఫ్టీ కోసం కొత్త యాప్​ను తీసుకొచ్చింది. ఈ యాప్​ను ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా ప్లేస్టోర్​లో అందుబాటులోకి తెచ్చింది. ఈ గార్డియన్​ యాప్​​ ద్వారా మహిళలు, చిన్నారులకు అదనపు భద్రత చేకూరుతుందని ట్రూకాలర్​ పేర్కొంది. ఈ మేరకు దీనిలో 'ఎమర్జెన్సీ' అనే బటన్​ను కూడా చేర్చామని చెబుతోంది. 
 
కాగా, చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. వాళ్లు బయటికెళ్లి, మళ్లీ ఇంటికి సురక్షితంగా తిరిగొచ్చేంత వరకు కుటుంబ సభ్యులు తెగ టెన్షన్​ పడుతుంటారు. ముఖ్యంగా మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారిన ఈ రోజుల్లో 'సేఫ్టీ' అనేది చాలా ముఖ్యం. ఈ మేరకు ఒంటరి ప్రయాణాలు లేదా బయటకు ఎక్కడికైనా వెళ్లిన సందర్భాల్లో ఈ గార్డియన్స్ యాప్​ ఎంతో ఉపయోగపడనుంది. 
 
గార్డియన్స్ యాప్​లో స్నేహితులు, కుటుంబ సభ్యులను సంరక్షకులుగా చేర్చవచ్చు. ఇందుకోసం వారికి రిక్వెస్ట్​ సెండ్​ చేస్తే సరిపోతుంది. వారు రిక్వెస్ట్​ యాక్సెప్ట్​ చేయగానే, మన లైవ్​ లొకేషన్​ను యాక్సెస్​ చేయడానికి 'వాచ్​ ఓవర్​ మీ' ఫీచర్​ను చేర్చింది. లైవ్​ లొకేషన్​ను మన గ్రూపులోని సభ్యులతో కూడా శాశ్వతంగా షేర్​ చేసుకోవడానికి 'ఫరెవర్ షేర్​' అనే ఫీచర్​ను కూడా చేర్చింది. 
 
అంతేకాక, గార్డియన్​ యాప్​లో 'హెల్ప్​ మీ' అనే బటన్​ కూడా ఉంటుంది. ఇది మనం ఎంచుకున్న గార్డియన్​కు అత్యవసర నోటిఫికేషన్స్​తో పాటు లొకేషన్​ డేటాను సెండ్​ చేస్తుంది. అంతేకాదు, ఫోన్​ స్టేటస్​ డేటా, బ్యాటరీ లెవల్​, ఫోన్​ ప్రొఫైల్​ స్టేటస్​ వంటి విషయాలను కూడా గార్డియన్​కు చేరవేస్తుంది. ట్రూ కాలర్ వినియోగదారులు ప్లేస్టోర్​లో గార్డియన్​ యాప్​ను డౌన్‌లోడ్ చేసి ఒకే టాప్​తో సైన్ ఇన్ అవ్వొచ్చు.