సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (17:24 IST)

అసలైన పబ్జీ గేమ్‌కు సీక్వెల్‌గా పబ్జీ న్యూ స్టేట్ గేమ్‌..

pubg game
భారత్‌లో పబ్జీ గేమ్‌‌కు ప్రత్యామ్నాయం వస్తోంది. పాత గేమ్‌కు కొనసాగింపుగా మరిన్ని సెట్టింగ్స్, కొత్త పీచర్లతో పబ్‌జీ న్యూ స్టేట్ గేమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఈ గేమ్ గురించి కొత్త సమాచారం బయటకు వచ్చింది. పబ్జీ పేరెంట్ కంపెనీ క్రాఫ్టాన్.. కొత్త గేమ్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 
 
పబ్ జీ న్యూ స్టేట్ గేమ్‌కు సంబంధించిన వెబ్‌సైట్ సోర్స్ కోడ్‌ హిందీ లాంగ్వేజ్ వెర్షన్‌కు కూడా మద్దతు ఇస్తోంది. ప్రస్తుతానికి హిందీ భాషను డిసేబుల్ చేసినట్టు కనిపిస్తోంది. దీంతో ఈ గేమ్‌ను మన దేశంలో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని పబ్జీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలైన పబ్జీ గేమ్‌కు సీక్వెల్‌గా పబ్జీ న్యూ స్టేట్ గేమ్‌ను అభివృద్ధి చేశారు. కొత్త గేమ్‌లో బ్యాటిల్ గేమ్ ప్లే పూర్తి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
కానీ పబ్‌జీ న్యూ స్టేట్ గేమ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. మన దేశంలో దీన్ని లాంఛ్ చేస్తారో లేదో కూడా తెలియదు. భారత్‌లో కొత్త గేమ్ ప్రీ- రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించలేదు. కానీ హిందీ భాషకు వెబ్‌సైట్ మద్దతు ఇస్తోందనే వివరాలను ఒక గేమింగ్ బ్లాగ్ లీక్ చేసింది.