2021 ఫిబ్రవరిలోపు భారత్‌లోకి పబ్ జీ.. కానీ ఆ ఫేక్ డౌన్లోడ్ లింక్స్ క్లిక్ చేస్తే..?
పబ్ జీపై నిషేధం విధించిన తర్వాత.. అరెరె అంటూ కుంగిపోయిన పబ్ జీ ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్. పబ్జీ సహా 118 చైనీస్ యాప్స్‌ను భారత ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌లో బ్యాన్ చేసింది. భారత సమగ్రతకు, భద్రతకు ఈ యాప్స్ ముప్పుగా ఉన్నాయని, డేటాను చోరీ చేస్తున్నాయని పేర్కొంది. కాగా మళ్లీ గేమ్‌ను భారత్‌లో మళ్లీ లాంచ్ చేసేందుకు పబ్జీ కార్పొరేషన్ ప్రయత్నిస్తూనే ఉంది.
ఈ క్రమంలో భారత్‌లో గేమ్‌ను లాంచ్ చేస్తామని పబ్జీ ఇటీవల ప్రకటించింది. అయితే గేమర్లు మాత్రం ఇంకొంత కాలం వేచిచూడాల్సిందే. 2021 ఫిబ్రవరిలోపే భారత్‌లో పబ్జీ వచ్చే అవకాశం ఉంది. అయితే పబ్జీ అంటూ కొన్ని సైట్లలో లింక్ కనిపిస్తున్నాయి. ఏపీకే ఫైల్స్ కు లింక్ లు ఉంటున్నాయి. అయితే అవన్నీ నకిలీవే.
పబ్జీ అని ఉన్న ఫేక్ లింక్‌లకు క్లిక్ చేయడం ప్రమాదకరం. దీనివల్ల మొబైళ్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని వెబ్సైట్లలో లభిస్తున్న థర్డ్ పార్టీ ఏపీకే ఫైల్స్‌ను కొందరు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇవి జెన్యూన్ ఫైల్స్ కావు. దీన్ని వల్ల ఫోన్లోకి మాల్వేర్ వచ్చి.. తెలియకుండా డేటా చోరీకి గురవుతుంది. కాబట్టి పబ్ జీ డౌన్లోడ్ విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.
గేమ్ వచ్చేసిందంటూ పుకార్లు పెరిగిపోతుండడంతో పబ్జీ కార్పొరేషన్ స్పందించింది. యూజర్లు ఇంకొంత కాలం వేచిచూడాలని సూచించింది. స్థానిక నిబంధనల ప్రకారం ప్లేయర్లు డేటా సురక్షితంగా, భద్రంగా ఉండేలా గేమ్‌ను తీసుకొస్తున్నామని ప్రకటించింది.