దర్శకనటి, ఫెమినిస్ట్ నందితా దాస్ ఏడేళ్ళ వివా హంబంధాన్నికి స్వస్తి?
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడాకుల పరంపర కొనసాగుతోంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, దర్శకనటి, ఫెమినిస్ట్ నందితా దాస్ విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో తన 7 యేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పనుంది. ఈ విష
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడాకుల పరంపర కొనసాగుతోంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, దర్శకనటి, ఫెమినిస్ట్ నందితా దాస్ విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో తన 7 యేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పనుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించారు.
దీనిపై ఆమె స్పందిస్తూ... "విడిపోవడం అంటే అంత సులువు కాదు, ముఖ్యంగా పిల్లలు ఉన్నపుడు అది మరింత కష్టం. కానీ తప్పదు. మా అబ్బాయి భవిష్యత్ ముఖ్యం కాబట్టి విడిగా ఉన్నా.. తన భవిష్యత్తుకు ఎలాంటి లోటూ లేకుండా చూడాలనుకున్నాం" అంటూ చెప్పారు.
సామరస్యపూర్వకంగా విభేదాలను పరిష్కరించుకుంటున్నామని తెలిపారు. 2002లో సౌమ్య సేన్ అనే యువకుడిని పెళ్లాడిన నందితా దాస్.. అటుపై తననుంచి విడిపోయి.. నటుడు శుభోద్ మస్కారాను ఏడేళ్ల క్రితం పెళ్లాడారు. వీరికి విహాన్ అనే ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇతని భవిష్యత్ కోసమే ఇపుడు నటుడు శుభోద్‌తో విడాకులు తీసుకోవాలని భావిస్తోంది.