1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

చెల్లి స్నానం చేస్తుండగా చూశాడనీ వెల్డర్‌ను చంపేసిన సోదరుడు..

murder
తన చెల్లెలు స్నానం చేస్తుండగా చూశాడన్న అక్కసుతో వెల్డర్‌గా పని చేసే ఓ వ్యక్తిని ఓ యువకుడు తన అనుచరులతో కలిసి హత్య చేశాడు. ఈ దారుణం పుదుచ్చేరి రాష్ట్రంలోని బాగూర్ సమీపంలోని కరైయాంబదూర్ - పనైయడికుప్పం రోడ్డులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మోహన్ రాజ్ అనే వ్యక్తికి చేపల చెరువు ఉంది. ఇక్కడ ఓ యువకుడు వ్యక్తి రక్తపు మడుగులో పడివుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని అతన్ని వెల్డర్ రాజగురు (34)గా గుర్తించి, ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా, దినేష్ బాబు (27)ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. 
 
దినేష్ బాబు చెల్లికి ఇటీవలి వివాహమైందని, ఆమె ఇంట్లో స్నానం చేస్తుండగా మేడపై నుంచి రాజగురు చూశాడని, ఈ విషయం తెలుసుకున్న దినేష్ బాబు తన అనుచరులతో కలిసి రాజగురుపై దాడి తీవ్రంగా గాయపరిచినట్టు తేలింది. దీంతో దినేష్ బాబుతో సహా శర్మ, ముఖిలన్, సుమిత్, అచ్యుతన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.