బాలీవుడ్ నటుడు నుంచి విడాకులు కోరిన రెండోభార్య...

Nawazuddin Siddiqui,
ఠాగూర్| Last Updated: మంగళవారం, 19 మే 2020 (11:34 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విలక్షణ నటుడుగా గుర్తింపు పొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీకి మరోమారు సంసార కష్టాలు ఎదురయ్యాయి. ఈయన రెండో విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. లాక్డౌన్ సమయంలోనే ఈ విడాకులు నోటీసులను ఆమె పంపించారు. ఇపుడు ఇది బాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది.

నవాజుద్దీన్ సిద్ధిఖీ గతంలో షీబా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం సంసార జీవిన తర్వాత ఆమె నుంచి విడాకులు పొందారు. అటు పిమ్మట అలియా అనే మహిళను 2009లో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరి సంతానం కూడా ఉంది.

ఈ నేపథ్యంలో భర్త నుంచి విడాకులు కోరుతూ అలియా కోర్టును ఆశ్రయించింది. న‌వాజుద్దీన్ కుటుంబం విష‌యంలో ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్న నేప‌థ్యంలో అలియా మే 7న లీగ‌ల్ నోటీసులు పంపిన‌ట్టు తెలుస్తుంది.

కోవిడ్‌-19 కారణంగా లాక్డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇ-మెయిల్‌, వాట్సాప్‌ల ద్వారా నోటీసులు పంపినట్లు అలియా తరఫు లాయర్‌ అభయ్‌ తెలిపారు. విడిపోయిన త‌ర్వాత చెల్లించాల్సిన భ‌ర‌ణం గురించి కూడా ఇందులో ప్ర‌స్తావించారు. దీనిపై న‌వాజుద్దీన్ ఏం స్పందిస్తారా అనేది చూడాలి.దీనిపై మరింత చదవండి :