మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (17:50 IST)

అంజలి సీబీఐ ఆఫీసర్‌గా వస్తోన్న నయనతార

లేడి సూపర్ స్టార్‌గా నయనతార పేరు కొట్టేసింది. తమిళంలో వరుసబెట్టి సినిమాలు తీసుకుంటూ పోతోంది. లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా నయనతార నటించి తమిళంలో హిట్టైన ''ఇమైకా నొడిగల్'' సినిమా తెలుగులో విడుదల కానుంది. అంజలి సీబీఐ ఆఫీసర్ అనే పేరిట తెలుగులోకి ఈ సినిమా విడుదల కానుంది. 
 
ఫిబ్రవరి 22వ తేదీన ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా టైటిల్ రోల్‌లో నయనతార నటిస్తోంది. ఉత్కంఠభరితంగా సాగే ఈ కథలో నయన నటనకు తమిళ తంబీలు ఫిదా అయ్యారు. అలాగే తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ భావిస్తోంది. 
 
అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో, అధర్వమురళి, రాశిఖన్నా జంటగా కనిపించారు. తెలుగులో నయనతారకి, రాశి ఖన్నాకు మంచి క్రేజ్ వుండటంతో ఈ సినిమా టాలీవుడ్‌లో బంపర్ హిట్ అవుతుందని సినీ జనం అనుకుంటున్నారు.