శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (17:03 IST)

కోకో కోకిల అదుర్స్ రికార్డ్... ఇక తెలుగులోనూ కలెక్షన్ల వర్షం

వరుస విజయాలతో నయనతార దూసుకుపోతోంది. తమిళనాట నయనకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దక్షిణాది లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార తాజా సినిమా కోలమావు కోకిల ఇటీవల విడుదలైంది. ఈ సినిమా భారీ ఓపెనింగ్స్

వరుస విజయాలతో నయనతార దూసుకుపోతోంది. తమిళనాట నయనకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దక్షిణాది లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార తాజా సినిమా కోలమావు కోకిల ఇటీవల విడుదలైంది. ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌తో అదరగొట్టింది. తాజాగా విడుదలైన తొమ్మిది రోజుల్లో ఈ సినిమా రూ.20 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. 
 
ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా సౌత్‌లో ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే తొలిసారి. ఈ అరుదైన రికార్డును నయనతార సొంతం చేసుకోవడం పట్ల ఆమె ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని అందించాడు. 
 
తెలుగులో ఈ సినిమాను 'కోకో కోకిల'అనే పేరుతో ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులోను ఈ సినిమా ఆమెకి భారీ విజయాన్ని సంపాదించిపెడుతుందని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు.