ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (13:15 IST)

నయనతార బర్త్‌డే స్పెషల్.. రాక్కాయిగా లేడీ సూపర్ స్టార్

raakkayi
అగ్రహీరోయిన్ నయనతార తన పుట్టిన రోజు వేడుకలను నవంబరు 18వ తేదీ సోమవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె నటించే కొత్త చిత్రం టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ చిత్రానికి 'రాక్కాయి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్, మూవీవర్స్ ఇండియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సెంథిల్ నల్లస్వామి దర్శకుడు. 
 
ఈ సినిమాలో నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. చీరకట్టులో నడుముకు కొంగు బిగించి, చేతిలో కర్ర పట్టుకుని సమరానికి సిద్దమైన రీతిలో ఉన్న ఆమె లుక్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర బలమైన శక్తిని ప్రతిబింభిస్తుందనే సంకేతాలు పోస్టర్‌లో కనిపిస్తున్నాయి.
 
ఈ సినిమా జోనర్, డైరెక్టర్, ఇతర ముఖ్యమైన వివరాల గురించి ఇంకా గోప్యతను పాటిస్తున్నారు, దీంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. నయనతార ఎప్పుడు కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంటుందో, ఈ సినిమా కూడా అలాంటి మరో మైలురాయిగా నిలవబోతుందని అంచనా వేస్తున్నారు. 
 
ఆమె ఇప్పటివరకు చేసిన అద్భుతమైన పాత్రలు ఆమె ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి.ఈ పోస్టర్ విడుదలతో, ఇది యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందా, లేక హిస్టారికల్ డ్రామాగా ఉంటుందా అనే చర్చలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. నయనతార లుక్ మాత్రమే కాదు, సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఉంటుందని భావిస్తున్నారు.
 
తన కెరీర్‌లో ఎప్పుడూ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన నయనతార, స్త్రీ ప్రధాన కథాంశాలను ముందుకు తీసుకెళ్తూ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఈ కొత్త ప్రాజెక్టు కూడా ఆమె నటనలో మరో కొత్త కోణాన్ని చూపుతుందని నమ్మకంగా చెప్పొచ్చు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అభిమానుల్లో ఆసక్తి పుట్టించడానికి ఆమె మరోసారి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అందరూ టైటిల్ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది నయనతార కెరీర్‌లో మరో కీలకమైన సినిమాగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు.