సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (15:39 IST)

నందమూరి బాలకృష్ణ 108 చిత్రం.. భగవత్ కేసరి.. టైటిల్ కన్ఫామ్?

Kesari
Kesari
నందమూరి బాలకృష్ణ 108 చిత్రం టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. అయితే మేకర్స్ దీనికి ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ పెట్టినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
సినిమా పంపిణీ హక్కులను కొనుగోలు చేసిన మైత్రీ మూవీ మేకర్స్ తన కార్యాలయంలో బిల్ బోర్డును ఏర్పాటు చేసింది. స్టాండీలో బాలకృష్ణ ఫేస్, సినిమా టైటిల్ ఉన్నాయి. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజున ఈ సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నారు.