శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (10:13 IST)

జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి: నిహారిక ఇన్‌స్టాలో లవ్ ఫెయిల్యూర్ పాట

Niharika Wedding
మెగా డాటర్ నిహారిక మాజీ భర్త.. జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమైనట్లు టాక్ వస్తోంది.  చైతన్య తల్లిదండ్రులు వారి కుటుంబంలో వరుసయ్యే అమ్మాయిని వెతికారని, తన కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఐపీఎస్ అధికారి కూతురితో చైతన్య రెండో వివాహం జరగబోతోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. 
 
అన్నీ కుదుర్చుకుని సింపుల్‌గా వీరి వివాహాన్ని పూర్తి చేయాలని చైతూ ఫ్యామిలీ అనుకుంటుందట. ఈ నేపథ్యంలో నిహారిక లవ్ ఫెయిల్యూర్ పాటను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఎంత విడిపోయినా బాధ వుంటుందని నిహారిక ఈ సాంగ్ ద్వారా చెప్పేశారని టాక్. నిహారికతో విడాకుల తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న చైతన్య రెండో పెళ్లి చేసుకోవడంపై నిహారిక బాధపడుతున్నట్లు తెలుస్తోంది.