1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 నవంబరు 2023 (18:04 IST)

త్వర‌లో తండ్రి కాబోతున్న హీరో నిఖిల్ సిద్ధార్థ

Nikhil and pallavi
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ త్వర‌లో తండ్రి కాబోతున్నాడు. నిఖిల్ భార్య గర్భవతి అంటూ సోష‌ల్ మీడియాలో వార్తలు వైర‌ల్ అవుతున్నాయి.

ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న నిఖిల్ భార్య డాక్టర్ పల్లవి బేబీ బంప్‌తో కనిపించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పల్లవి గర్భవతి అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
అయితే ఈ విష‌యంపై నిఖిల్ మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక‌ ప్రకటన చేయలేదు. ఇక 2020లో డాక్టర్ పల్లవిని నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.