suvichar
✕

భీష్మ టీజ‌ర్ రిలీజైంది, టాక్ ఏంటి?

Written By శ్రీ
Updated: మంగళవారం, 12 నవంబరు 2019 (21:07 IST)
నితిన్, రష్మిక మందన, వెంకీ కుడుముల కాంబినేషన్లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'. ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను ఇటీవల విడుదల చేసింది చిత్రం యూనిట్. 'కథానాయకుడు నితిన్ 'నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా...కన్పిస్తుంటుంది కానీ క్యాచ్ చెయ్యలేం' అంటూ చెప్పే సంభాషణలతో, కేవలం కొద్ది క్షణాలే కనిపించే ఈ వీడియోకి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభించింది. 
 
కథానాయకుడు నితిన్ ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు. ఇటీవల చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న చిత్రం విడుదలయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
 
చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ... ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను సుప్రసిద్ధ దర్శకుడు, మా గురూజీ త్రివిక్రమ్ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయటం జరిగింది. వీటికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. 
 
నితిన్,రష్మిక జంట చూడముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి. వీటికి ముందు ప్రచార చిత్రాలను దీపావళి పర్వదినాన విడుదలచేయటం జరిగింది. వీటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభించింది.
 
'భీష్మ' చిత్ర కధ, కధనాలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్‌కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.

అన్నీ చూడండి

గుడ్‌నైట్ నా బుజ్జి బంగారం, భార్య ఫోన్ నుంచి ప్రియురాలికి భర్త వాట్సప్ మెసేజ్, అంతే...

రోడ్డు డివైడర్ వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న మోటార్ సైకిల్.. ఇద్దరు మృతి

హైదరాబాద్, తెలంగాణ జిల్లాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

అమెరికాలో ఉద్యోగం వచ్చి వారమే, జింక వల్ల తెలుగు టెక్కీ దుర్మరణం

మహిళా ప్రయాణికురాలిపై జీఆర్పీ కానిస్టేబుల్ దాడి.. ప్రయాణీకురాలిపై చెంపదెబ్బ (video)

అన్నీ చూడండి

డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్‌కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి

సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్

చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?

తర్వాతి కథనం
Show comments