మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2019 (12:26 IST)

కన్నడ బ్యూటీ సన్నజాజి నడుంపై కన్నేసిన 'భీష్మ'

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నాపై టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ కన్నేశాడు. దీంతో రష్మిక నడుంను పట్టుకునేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. అయితే, ఈ లవర్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో "భీష్మ" రిలీజ్ అయ్యేంతవరకు వేచిచూడాల్సిందే. 
 
నితిన్ తాజా చిత్రం భీష్మ. వెంకీ కుడుముల దర్శకత్వం వహించే ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జ‌రుగుతుంద‌ని సమాచారం. 
 
అక్కడ ఓ పాటతో పాటు, కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్రం నుండి రెండు ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట‌ర్స్ విడుద‌ల చేశారు. ఇవి అభిమానుల‌లో ఆనందాన్ని క‌లుగ‌జేస్తున్నాయి.