సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

నిజాలు తెలుసుకుని వార్తలు రాయండి.. పెళ్లి వార్తలను ఖండించిన నిత్యామీనన్

nithya menon
తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలపై హీరోయిన్ నిత్యామీనన్ స్పందించారు. నిజాలు తెలుసుకుని విలేఖరులు వార్తలు రాయాలని హితవు పలికారు. గత కొంతకాలంగా మలయాళ స్టార్ హీరోతో నిత్యామీనన్ రొమాన్స్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇపుడు అతన్ని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాతో పాటు వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించారు. 
 
తన పెళ్లిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. ఇలాంటి కథనాలు ప్రచురించేముదు ఓసారి నిర్ధారణ చేసుకుంటే మంచిదని హితవు పలికారు. నిజాలను ప్రచురిస్త ఎవరికీ అభ్యంతరం ఉండదని ఆమె వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఆమె ఇటీవల భీమ్లా నాయక్ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆమె నటించిన "మోడ్రన్ లవ్" అనే వెబ్‌ సిరీల్ అమెజాన్ ప్రైజ్ ఓటీటీలో ప్రేక్షకాదారణ పొందుతోంది.