శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 5 అక్టోబరు 2018 (11:56 IST)

నోటా సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లు ఖాళీ.. ఎందుకు?

ఎన్నో వివాదాల తరువాత నోటా సినిమా విడుదలైంది. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా కనిపించిన విజయ్ దేవరకొండ మొదటిసారి రాజకీయ నాయకుడిగా నటించిన చిత్రం నోటా. ఈ సినిమా అటు తమిళం, ఇటు తెలుగు భాషాల్లో విడుదలైంది.

ఎన్నో వివాదాల తరువాత నోటా సినిమా విడుదలైంది. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా కనిపించిన విజయ్ దేవరకొండ మొదటిసారి రాజకీయ నాయకుడిగా నటించిన చిత్రం నోటా. ఈ సినిమా అటు తమిళం, ఇటు తెలుగు భాషాల్లో విడుదలైంది. ప్రేక్షకులు మాత్రం సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.
 
అయితే సినిమా బ్రహ్మాండంగా వచ్చిందని, ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి సినిమా తీయలేదని, అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లనే సినిమా భారీ విజయం దిశగా దూసుకెళ్ళడం ఖాయమని, ఇప్పటివరకు నటించిన సినిమాలు ఒక ఎత్తు.. నోటా సినిమాలో నా క్యారెక్టర్ మరో ఎత్తు అంటూ విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేశారు. దీంతో అభిమానుల అంచనాలు మరింత దాటాయి. గత నాలుగు రోజులుగా మాత్రం నోటా సినిమాపై వివాదం రేగింది. తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో ఒక పార్టీని ఉద్దేశించి సినిమా ఉందని నిర్మాత జగదీశ్వర్ రెడ్డి ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు.
 
ఆ తరువాత సినిమా యూనిట్ మాత్రం వివాదానికి తెరలేపవద్దని.. దయచేసి మానుకోండంటూ సూచించింది. ఇది జరుగుతుండగానే నోటా సినిమా విడుదలైంది. ఫ్యాన్సీ షో ఎక్కడా ప్రదర్శించలేదు. ఉదయం 9 గంటల షోనే అన్ని ప్రాంతాల్లో నడుస్తోంది. అయితే నోటా సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. థియేటర్ల వద్ద అభిమానులు నేరుగా వెళ్ళి టిక్కెట్లను తీసుకుంటున్నారు. పరీక్షా సమయం ఉండటంతోనే సినిమా థియేటర్లు ఖాళీగా ఉన్నాయంటున్నారు సినీ విశ్లేషకులు. 
 
నోటా సినిమా గురించి ఆ నోటా ఈ నోటా ప్రచారం ప్రారంభమైతే ఆటోమేటిక్‌గా సినిమాకు ప్రేక్షకులు క్యూకడతారంటున్నారు. గీత గోవిందం సినిమా కన్నా ఎక్కువగానే ప్రేక్షకులు నోటా సినిమాను ఆదరించే అవకాశం కూడా ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి ఇది జరుగుతుందో లేదో..?