1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (16:34 IST)

'నోటా' నొక్కాలని చెప్పడం లేదు.. కానీ యువ సీఎంను చూస్తారు : విజయ్ దేవరకొండ

టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "నోటా". ఈ చిత్రం విడుదలకు ముందే బోలెడు వివాదాలు మూటగట్టుకుంటోంది. నోటా వల్ల ఎన్నికలు ప్రభావితమవుతున్నాయని, ప్రజలు 'నోటా' బటన్‌ నొక్కుతారేమో? అనీ,

టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "నోటా". ఈ చిత్రం విడుదలకు ముందే బోలెడు వివాదాలు మూటగట్టుకుంటోంది. నోటా వల్ల ఎన్నికలు ప్రభావితమవుతున్నాయని, ప్రజలు 'నోటా' బటన్‌ నొక్కుతారేమో? అనీ, ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
 
దీనిపై ఈ చిత్రం విజయ్ దేవరకొండ స్పందిస్తూ, 'నోటా' చిత్రం ఒక పార్టీకి అనుకూలంగానూ, మరోపార్టీకి వ్యతిరేకంగా ఉంటుందని భావించే కొందరు కేసు పెట్టారన్నారు. నిజానికి అసలు ఈ చిత్ర కథ గురించి 'నన్ను అడిగితే.. నేను చెబుతా కదా! మేం 'నోటా' బటన్‌ నొక్కాలని చెప్పడం లేదు. ఒక పార్టీకి ఫేవర్‌గా ఏం చేయడం లేదు. ఒక్కటి మాత్రం నిజం... ఎన్నికలను ప్రభావితం చేసే పవర్‌ మన దగ్గర ఉంది. సినిమాలో యువ ముఖ్యమంత్రిని చూస్తారు అని విజయ్ దేవరకొండ చెప్పారు. 
 
ఇదిలావుంటే, విజయ్ దేవరకొండ నిర్మాతగా మారనున్నాడు. నిజానికి విజయ్ మొదటి నుంచి కూడా దూకుడు చూపుతూనే వస్తున్నాడు. విజయ్ దేవరకొండను దగ్గర నుంచి చూసిన వాళ్లకి, ఆయనకి నాన్చుడు ధోరణి ఇష్టం ఉండదనే విషయం అర్థమైపోయి ఉంటుంది. ఈ కారణంగానే ఆయన చేయదలచుకున్నది చేసేస్తుంటాడు. ఇపుడు ఆయన నిర్మాతగానూ మారిపోతున్నాడు.
 
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం వలన, ఇందులో సందేహించవలసిన అవసరం లేదు. 'మా రౌడీస్ అంతా ప్రొడక్షన్‌లోకి అడుగుపెడుతున్నారు. మా ప్రొడక్షన్‌లో జ్ఞానవేల్ రాజా పార్టనర్‌గా చేరడం ఎంతో ఆనందంగా వుంది. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమాలు గ్రాండ్‌గా ఉంటాయి .. నాలుగైదు భాషల్లో విడుదలవుతాయి అని విజయ్ దేవరకొండ అనుచరులు చెప్పుకొచ్చారు.