శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (09:28 IST)

నేను పొలిటీషియన్ అయితే, అంతో ఇంతో పర్సెంటేజ్ కొడతా : విజయ్ దేవరకొండ

నేటి రాజకీయాలు, రాజకీయ నేతలు, రాజకీయ వ్యవస్థపై టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో తాను పొలిటీషియన్ అయినా అంతో ఇంతో పర్సెంటేజ్ కొడతానన్న ఫీలంగ్ కలుగుతోందన్నారు. అంటే అం

నేటి రాజకీయాలు, రాజకీయ నేతలు, రాజకీయ వ్యవస్థపై టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో తాను పొలిటీషియన్ అయినా అంతో ఇంతో పర్సెంటేజ్ కొడతానన్న ఫీలంగ్ కలుగుతోందన్నారు. అంటే అంతలా మన రాజకీయ వ్యవస్థ మారిపోయిందని వ్యాఖ్యానించారు.
 
తాను నటించిన తాజా చిత్రం "నోటా". ఈ చిత్రం శుక్రవారం (అక్టోబరు 5వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీన్ని పురస్కరించుకుని విజయ్ మీడియాతో మాట్లాడారు. అపుడు విలేకరులు నేటి రాజకీయాలపై ప్రశ్నలు సంధించారు. దీనికి హీరో విజయ్ ఓపిగ్గా సమాధానమిచ్చారు. 
 
'నాకు రాజకీయాల మీద ఎప్పుడూ ఓ అవగాహన ఉంటుంది. రాజకీయాల మీద ఓ అభిప్రాయం కూడా ఉంటుంది. నేను కోరుకునే పాలన ఎలాంటిదంటే.. నేను షూటింగ్‌కి వెళ్లాలని రోడ్డు మీదకు వస్తే నేను గంటల తరబడి ట్రాఫిక్‌లో ఉండకూడదు. మా ఇంటికి నీళ్లు రావాలి. మాకు కరెంట్‌ కోత ఉండకూడదు. రోడ్ల మీద గుంతలు ఉండకూడదు. సిటీలో గాలి కాలుష్యం ఉండకూడదు. లా అండ్‌ ఆర్డర్‌ బాగుండాలి. ఎవరైనా ఇలాంటివే కోరుకుంటారు' అని చెప్పుకొచ్చారు. 
 
కానీ 'కొన్నిసార్లు స్కామ్‌లు జరిగాయని చెప్పే అమౌంట్‌లను చూస్తే కళ్లు తిరుగుతాయి. అది భోఫోర్స్‌ కానీ, మరొకటి గానీ.. ఏదైనా కళ్లు తిరుగుతాయి. నార్మల్‌ ఇండియాలో పుట్టి, ఇండియన్‌లా ఆలోచిస్తే "అరే.. ఈ డబ్బంతా మన గురించి వాడితే ఇంకెంత బాగుంటుంది" అనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఇన్ని లక్షల కోట్లు స్కామ్‌ చేసి, ఒక్కడివి ఏం చేసుకుంటావురా.. ఎన్ని తరాలకు కూడబెడుతావురా అని అనిపిస్తుంది. నేను పొలిటీషియన్‌‌ని అయినా... అంతో ఇంతో పర్సెంటేజ్‌ కొడతా అని నా ఫీలింగ్‌ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.