శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (12:31 IST)

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుండి ‘విజయం’ పాట విడుదల

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. తనను తాను ఆంధ్ర ప్రదేశ్ ఆడపడుచుల అన్నగా అభివర్ణించుకునే నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించినప్పటి నుండీ... అందరూ గౌరవంగా అన్నగారూ అని పిలుచుకునే స్థాయి నుండి ఆయనపై చెప్పులు వేసే స్థాయి వరకు సాగిన ఆయన పతనానికి సంబంధించిన కథను ఇతివృత్తంగా తీసుకుని ఈ కథను తెరకెక్కించడం జరిగింది.
 
కాగా... ఈ చిత్రం నుండి ‘విజయం విజయం ఘన విజయం.. విజయం విజయం శుభ సమయం’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది. సిరాశ్రీ వ్రాసిన ఈ పాటకు కల్యాణ్ మాలిక్ సంగీతం అందించారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, మోహన భోగరాజులు ఈ పాటను ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.