సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 17 మార్చి 2019 (16:45 IST)

సెన్సార్ బోర్డుపై కేసు పెడ్తా : రాంగోపాల్ వర్మ

తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రం ఈనెల 22వ తేదీన రిలీజ్ చేయాలని ఆయన భావించారు. కానీ, ఈ చిత్రాన్ని విడుదల చేయరాదంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు సెన్సార్ బోర్డులో ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు.. ఏపీలో తొలిదశ పోలింగ్ ముగిసే వరకూ సినిమా సెన్సార్‌ను వాయిదా వేస్తామని బోర్డు తెలిపింది. 
 
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఎన్నికల సమయంలో రిలీజైతే టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేవీబాబు అనే టీడీపీ కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సెన్సార్ బోర్డుకు పలు సూచనలు చేసింది. దీంతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై నిర్ణయం తీసుకున్నట్టు సెన్సార్ బోర్డు వర్గాలు తెలిపాయి. 
 
ఈ నేపథ్యంలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రబృందానికి సెన్సార్ బోర్డు నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికలు పూర్తయ్యాక సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ సెన్సార్ వర్గాలు సూచించాయి. దీనిపై స్పందించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ న్యాయపోరాటం చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించడానికి గల కారణాలు, ఆమె ప్రవేశించిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో వచ్చిన మార్పులు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ప్రధాన ఇతివృత్తమని వెల్లడించారు.