నన్ను చంపేస్తేనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రిలీజ్ ఆగుతుంది..
టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. తాను నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పైగా, ఈ చిత్రం విడుదలను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి దృష్టికోణం నుంచి తెరకెక్కించారు. ఈ చిత్రంకి సంబంధించి విడుదలైన రెండు ట్రైలర్స్ నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 22న చిత్రాన్ని థియేటర్స్‌లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తుండగా, కొందరు చిత్రాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
దీనిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ, "ఆర్జీవీ సినిమా రిలీజ్‌ని ఆపాలంటే ముందుగా నన్ను చంపండి. ఒకవేళ నన్ను చంపినా కూడా సినిమా రిలీజ్ ఆగదు'. ఓ హార్డ్ డిస్క్‌లో రష్ అంతా వుంచి, నాకేమైనా అయితే ఇందులో వున్న కంటెంట్ అంతా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలని చీటీరాసి పెట్టాను. అందువల్ల దీన్ని బయటకు రాకుండా అయితే ఎవ్వరూ ఆపలేరు' అని వ్యాఖ్యానించారు.
కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఏయే అంశాలు చూపిస్తాడా అనే దానిపై హాట్ టాపిక్ నడుస్తుంది. తాజాగా చిత్రం నుండి "సింహగర్జన" అనే వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ అభిమానులని ఆకట్టుకుంటుంది.