బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 13 జులై 2023 (10:35 IST)

రోజా నుంచి నా ఫార్ములా, మైండ్ సెట్ ఒక్కటే నాలో మార్పు లేదు : ఏఆర్ రెహమాన్

AR Rahman
AR Rahman
సంగీతంలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు వస్తున్నాయి. ఇలా ఎన్ని మార్పులు వచ్చినా మెలోడీ ఎప్పటికీ మారదు. వైబ్రేషన్ కొంచెం చేంజ్ అవుతుంది. కానీ, మెలోడీ & లిరిక్ ఎప్పుడూ సేమ్. గత 35, 40 ఏళ్లుగా సేమ్ ఉంది. 'రోజా' నుంచి నా ఫార్ములా, మైండ్ సెట్ ఒక్కటే... సాంగ్ సింపుల్, క్యాచీగా ఉండాలి. బీట్ చేంజ్ అవుతుంది. మిక్సింగ్ చేంజ్ అవుతుంది. నా కోర్ కాన్సెప్ట్, మ్యూజిక్ కంపొజిషన్ థాట్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. ప్రేక్షకుల్లో, సమాజంలో మార్పులు వచ్చాయి. సంగీతంపై ఆ ప్రభావం ఉంటుంది- అని ఏఆర్ రెహమాన్ తేల్చి చెప్పారు. 
 
తమిళ చిత్రం  'మామన్నన్' తెలుగు ప్రేక్షకుల ముందుకు 'నాయకుడు'గా రానుంది. ఇందులో ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు లో జులై 14న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఆన్ లైన్ లో తెలుగు మీడియాతో ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు.
 
 'నాయకుడు' కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది? ఎవరు మిమ్మల్ని సంప్రదించారు?
తొలుత ఉదయనిధి స్టాలిన్ గారు నన్ను సంప్రదించారు. 'నాయకుడు' సినిమాకు సంగీతం అందించాలని అడిగారు. ఆ తర్వాత నేను కథ విన్నాను. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. నాకు నచ్చిన కథల్లో ఇదొకటి. కథ విన్నాక... సినిమా చేస్తానని చెప్పాను. 
 
'నాయకుడు' సినిమా మీ నుంచి ఏం డిమాండ్ చేసింది? ఎలాంటి మ్యూజిక్ కోరుకుంది? ప్రయోగాలు ఏమైనా చేశారా?
దర్శకుడు మారి సెల్వరాజ్ ఇంతకు ముందు తీసిన సినిమాలు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాను తీయాలనుకున్నారు. ఈ కథకు మరింత మాస్ అప్పీల్ ఇచ్చారు. సంగీతం ఎక్కువ మందికి చేరువ అయ్యేలా ఉండాలనుకున్నారు. ప్రయోగాలు, కొత్తగా అంటే... చాలా రోజుల తర్వాత నేను జానపద తరహాలో గీతాలు చేశా. మ్యూజిక్ రాయల్ గా ఉండాలనుకున్నా. 
 
ఉదయనిధి స్టాలిన్ మీ జానపద గీతాలకు ఎలా డ్యాన్స్ చేశారని అనిపించింది?
షూటింగ్ స్టార్ట్ చేయడానికి నెల ముందు నా దగ్గరకు వచ్చారు. తొలుత ఒక పాట చాలు అన్నారు. నేనూ ఒక పాట ఇచ్చాను. మిగతా పాటలకు షూటింగ్ చేశాక... బాణీలు అందించాను. ప్రతి పాటకు ఒక అర్థం ఉంటుంది. 
 
'నాయకుడు' సినిమా సంగీతం గురించి ఏం చెబుతారు?
ఉదయనిధి స్టాలిన్, మారి సెల్వరాజ్... ఇద్దరితో మొదటిసారి 'నాయకుడు' కోసం పని చేశా. ఈ కథ చాలా స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఇదొక టఫ్ సబ్జెక్టు. బాగా డీల్ చేశారు. 'నాయకుడు'లో తండ్రీ కుమారుల మధ్య అనుబంధం ఉంటుంది. రాజకీయం ఉంటుంది. 
 
నేపథ్య సంగీతానికి ఎంత స్కోప్ ఉంటుంది?
చాలా ఉంది. నేను 20 శాతమే ఎక్స్పెక్ట్ చేశా. కానీ, 80 పర్సెంట్ ఉంది. నేపథ్య సంగీతం బాగా వచ్చింది. 
 
ఇటీవల మీరు 'పొన్నియన్ సెల్వన్'కు సంగీతం అందించారు. అదొక చారిత్రక కథ. సంగీత దర్శకుడిగా సవాల్ విసిరే సినిమా అది. 'నాయకుడు' తరహా కమర్షియల్ కథలకు సంగీతం అందించేటప్పుడు ఎటువంటి సవాళ్లు ఎదురవుతాయి?
రాజకీయ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. సమాజంలోని అసమానతలు, ఇంకా ఎన్నో విషయాల గురించి చర్చించారు. చాలా అంశాలపై మాట్లాడారు. ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం ఓ కొత్త అనుభూతి. 
 
'నాయకుడు' సంగీతానికి మీకు బెస్ట్ అప్రిషియేషన్ ఎవరి నుంచి వచ్చింది?
పాటలు చాలా మందికి నచ్చాయి. సినిమాలో ఏడు పాటలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో పాట గురించి మాట్లాడారు. ఒక్కటి కాంప్లిమెంట్, అప్రిషియేషన్ అని చెప్పలేను. 
 
ఆస్కార్ అవార్డుకు ముందు, తర్వాత అని రెహమాన్ లో ఎటువంటి మార్పులు వచ్చాయని అడిగితే ఏం చెబుతారు?
నేను సేమ్ అండి. నాలో మార్పు ఏమీ రాలేదు. అయితే... ప్రపంచంలో మనకు ఇచ్చే గౌరవం పెరిగింది. అమెరికా, యూరప్ దేశాల్లో ఎక్కువ మందికి తెలిసింది.