గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 25 జులై 2024 (18:25 IST)

ఆపరేషన్ రావణ్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది: దర్శకుడు మారుతి

Thiruveer, Maruthi, Rakshit Atluri, Venkata Sathya
Thiruveer, Maruthi, Rakshit Atluri, Venkata Sathya
రక్షిత్ అట్లూరి నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్రముఖ దర్శకుడు మారుతి అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ - “ఆపరేషన్ రావణ్” సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని వెంకట సత్య గారిని అడిగేవాడిని. ఆయన మంచి టైమ్ చూసుకుని చేయాలని అనుకుంటున్నామని అనేవారు. ఈ నెల 26న మంచి డేట్ కు రిలీజ్ కు వస్తున్నారు. నేను ఆరు నెలల కిందట ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. వాళ్ల అబ్బాయిని హీరోగా పెట్టి వెంకట సత్య గారు థ్రిల్లర్ సినిమాను రూపొందించడం మామూలు విషయం కాదు. బాలీవుడ్ లో ఇలా కొందరు ఫాదర్ సన్ సక్సెస్ అయ్యారు. తెలుగులో ఇప్పుడు రక్షిత్, వెంకట సత్య గారు చేస్తున్నారు. లండన్ బాబులు అనే మూవీతో మెల్లిగా మొదలైన రక్షిత్ జర్నీ పలాసతో పీక్స్ కు వెళ్లింది. ఆ సినిమాలో తన నటనతో మెస్మరైజ్ చేశాడు రక్షిత్. అతనిలో పట్టుదల అంకితభావం ఉన్నాయి. మన పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు. “ఆపరేషన్ రావణ్” సినిమాతో రక్షిత్ మరింత మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ మాస్క్ మ్యాన్ ఎవరు అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు వెంకట సత్య గారు. “ఆపరేషన్ రావణ్” టీమ్ అందిరకీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
 
నటి శ్వేత మాట్లాడుతూ - “ఆపరేషన్ రావణ్” సినిమాలో నేను లక్ష్మీ అనే క్యారెక్టర్ చేశాను. ఇంతమంచి రోల్ నాకు ఇచ్చిన డైరెక్టర్ వెంకట సత్య గారికి థ్యాంక్స్. హీరో రక్షిత్ తో నాకు కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. సినిమా చాలా బాగుంటుంది. మీరంతా మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
దర్శకుడు వెంకట సత్య మాట్లాడుతూ - మీ ఆలోచనలే మీ శత్రువులు, సైకో థ్రిల్లర్ అనే ట్యాగ్ లైన్స్ తో ప్రమోషన్ చేస్తున్నాం గానీ మా సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ప్రేమ సెన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ప్రేమ ఇవ్వడం అనేది ఒకరకంగా ఉంటుంది. ప్రేమ అంతా నాకే కావాలని అనుకున్నప్పుడు మరో రకంగా ఉంటుంది. ఎంత డీప్ ప్రేమ, ఎంత వయలెంట్ గా మారింది అనేది ఈ సినిమాలో తెరకెక్కించాం. మన సినిమాల మనుగడ కష్టమవుతుంది అనే పరిస్థితులకు కారణాలు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాయి. ఎవరైనా పెద్దవారు ఇండస్ట్రీలో పెద్దగా బాధ్యతలు తీసుకుని మనం థియేటర్స్ లో ఇంత రేట్స్ ఎందుకు పెడుతున్నాం, పాప్ కార్న్ రేట్స్ ఇంతలా పెంచితే సినిమాకు ప్రేక్షకులు వస్తారా లేదా థియేటర్స్ ఒకవారం మూసేసి మరో వారం ఓపెన్ చేస్తున్నారు..ఇలాంటి అంశాలను ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నా. అన్నారు.
 
హీరో తిరువీర్ మాట్లాడుతూ - పలాస సినిమాలో నేను రక్షిత్ కలిసి నటించాం. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ గానే కొనసాగుతున్నాం. మారుతి గారు పలాస టైమ్ లో మాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా వచ్చారు. ఆయనకు థ్యాంక్స్. “ఆపరేషన్ రావణ్” సినిమాలో నేను నటించాల్సింది. ఈ కథ విన్న తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నా ఫేవరేట్ థ్రిల్లర్ మూవీస్ గుర్తొచ్చాయి. కథ చెప్పడమే కాదు అంతే బాగా తీశారు. నేను ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. అనివార్య కారణాలతో ఈ మూవీలో నటించలేకపోయాను. మీ అందరికీ నచ్చే మూవీ “ఆపరేషన్ రావణ్” అవుతుంది. తప్పకుండా చూడండి. అన్నారు.
 
హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ - నేను ఇండస్ట్రీలోకి రావడానికి డైరెక్టర్ మారుతి గారే కారణం. ఆయన ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉంటారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. “ఆపరేషన్ రావణ్” సినిమాను మా నాన్నగారు ఎంతో బాగా డైరెక్ట్ చేశారు. ఆయన ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అని సినిమా చూశాక ఎవరూ అనుకోరు. అంత బాగుంటుంది. నా ఫ్రెండ్ తిరువీర్. మేము కలిసి పలాసలో చేశాం. పిలవగానే ఆయన మా ఫంక్షన్ కు వచ్చారు. థ్యాంక్స్. మా సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. రాధిక గారి పర్ ఫార్మెన్స్ చూస్తే మీరు ఎంతో ఎమోషనల్ అవుతారు. మాస్క్ మ్యాన్ ఎవరో కనిపెట్టి మాకు చెబితే సిల్వర్ కాయిన్ ఇస్తామని చెప్పాం. సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. తప్పకుండా థియేటర్స్ లో “ఆపరేషన్ రావణ్” చూడండి. థ్రిల్ ఫీలవుతారు. అన్నారు.