శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 జులై 2024 (11:56 IST)

మీడియాకు క్షమాపణలు చెప్పిన నీతా అంబానీ.. ఎందుకో తెలుసా?

nita ambani
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ మీడియాకు క్షమాపణలు చెప్పారు. తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల వివాహం సందర్భంగా ఏదేని పొరపాటు జరిగివుంటే క్షమించాలని ఆమె మీడియాను కోరారు. పెళ్లి సందర్భంగా చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉందని తెలిపారు. పైగా, మీరంతా రేపు మా అతిథులుగా రావాలని, మీకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. 
 
కాగా, అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల వివాహం ఈ నెల 12వ తేదీన అంగరంగం వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత శుభ్ ఆశీర్వాద్, ఆదివారం మంగళ్ ఉత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు నీతా అంబానీ కృతజ్ఞతలు తెలుపుతూనే క్షమాపణలు కోరారు. 
 
మరోవైపు నీతా అంబానీ మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విధానాన్ని చూసి గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతులేని సంపద ఉన్నప్పటికీ ఆమెకు కించిత్ గర్వం కూడా లేదని కొనియాడుతున్నారు. మరోవైపు, ఆదివారం జరిగిన రిసెప్షన్‌లో తోడి పెళ్ళికుమారులుగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోలకు రూ.2 కోట్ల విలువ చేసే లగ్జరీ వాచీలను అనంత్ అంబానీ బహుమతిగా ఇచ్చిన విషయం తెల్సిందే.