ఇండియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు ఆస్కార్ అవార్డు
అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరుగుతున్న 91వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఇండియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి ఆస్కార్ అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా నిర్మించిన "పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్" అనే డాక్యుమెంటరీ సినిమాని ఆస్కార్ వరించింది.
ఈ సినిమాలో ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న పీరియడ్స్ (రుతుక్రమ) సమస్యలపై డాక్యుమెంటరీ రూపంలో చూపించారు. ఈ చిత్రానికి రేకా జెహ్‌తాబ్చి దర్శకత్వం వహించారు. ఆస్కార్ అవార్డును అందుకున్న రేకా... స్టేజ్‌పై ఉద్వేగానికి లోనయ్యారు. ఓ మై గాడ్. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యపై నేను డాక్యుమెంటరీ తీస్తే దానికి ఆస్కార్ వచ్చింది. నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు ఎన్నో ఇండియన్ సినిమాలు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యాయి. అవార్డు మాత్రం దక్కించుకోలేదు. ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. అలాంటిది ఓ డాక్యుమెంటరీ చిత్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలిచి... ఆస్కార్ అవార్డు దక్కించుకున్న తొలి ఇండియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ చరిత్ర సృష్టించింది.