బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (11:17 IST)

ముస్తాక్ అలీ ట్రోఫీ.. శ్రేయాస్ అయ్యర్ అదుర్స్.. 7 ఫోర్లు, 15 సిక్సర్లతో రికార్డ్

ఇండోర్‌లో జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి రోజున సిక్కింతో జరిగిన టీ20లో టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ విజృంభించాడు. తన బ్యాటుకు పనిపెట్టి 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్లు సాధించాడు. ఫలితంగా 147 పరుగులు చేసి భారత్ తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 
 
ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రిషభ్ పంత్ (128)ను అయ్యర్ అధిగమించి రికార్డు బద్ధలు కొట్టాడు. శ్రేయాస్ అయ్యర్ విజృంభణతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అనంతరం 259 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సిక్కిం 104 పరుగులకే కుప్పకూలి ఓటమిని చవిచూసింది. 
 
అంతకుముందు ఇదే ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పుజారా కేవలం 61 బంతుల్లోనే అజేయ శతకం బాదేశాడు. అంతేగాక దేశవాళీ టీ20లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. గ్రూప్‌-సిలో భాగంగా సౌరాష్ట్ర నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా, రైల్వేస్‌జట్టు ఐదు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులుండగానే గెలుపును నమోదు చేసుకుంది.