సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (16:11 IST)

స్మోక్ చేయడం.. మందు కొట్టడం వారి వారి వ్యక్తిగతం.. శ్వేత సాల్వే

హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు అక్కడి నుంచి కోలీవుడ్‌కు పాకిన మీ టూ ఉద్యమం గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో.. కొందరు హీరోయిన్లకు చెందిన ముద్దు ఫోటోలు, స్మోకింగ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో హిందీలో గురుక్షేత్రతో పాటు పలు సినిమాల్లో నటించిన శ్వేత సాల్వే.. ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 
 
తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో సింగిల్ పీస్ స్విమ్మింగ్ డ్రెస్‌లో మోకాలిపై కూర్చుని.. దమ్ము కొట్టే ఫోటోను పోస్టు చేసింది. అంతేగాకుండా మద్యం సేవించిన స్టిల్స్ కూడా శ్వేత సాల్వే పోస్టు చేసింది. ఈ ఫోటోలపై సర్వత్రా విమర్శలు రావడంతో శ్వేత స్పందించింది. అవును తాను తాగడం, స్మోక్ చేయడాన్ని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేమని చెప్పింది. 
 
స్మోక్ చేయడం, మందు కొట్టడం వారి వారి వ్యక్తిగత విషయమని.. తనను అనుసరించాలని తాను చెప్పట్లేదని శ్వేత చెప్పింది. అదే మర్యాదను తాను ఇతరుల నుంచి ఆశిస్తున్నానని.. తనను విమర్శించే హక్కు ఎవరికి లేదని చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో కామని.. తాను ఎవరికి చెప్పలేదని.. వారికి వారే ఫాలో అవుతున్నారని.. ఇష్టం వుంటే ఫాలో కావొచ్చు లేకుంటే అన్ ఫాలో కావొచ్చునని శ్వేత చెప్పింది.