ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (08:56 IST)

ఆస్కార్ సందడి ప్రారంభం.. హీరోహీరోయిన్లకు మాత్రమే ప్రవేశం .. విజేతలు వీరే..

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ సినీ రంగంలో ఎంతో గొప్పగా భావించే ఈ అవార్డుల కార్యక్రమం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కానీ, 93వ అకాడమీ అవార్డుల వేడుకను నిర్వహించి తీరాలన్న పట్టుదలతో నిర్వహికాలు ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. 
 
కాగా, కొవిడ్‌ కారణంగా రెండు ప్రాంతాల్లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే వేడుకకు హాజరవుతున్నారు. 'నోమ్యాడ్‌లాండ్' చిత్ర డైరెక్టర్‌ క్లోవీ చావ్‌ ఉత్తమ దర్శకురాలిగా ఎంపికయ్యారు. 
 
ఉత్తమ సంగీతం విభాగంలో సౌండ్‌ ఆఫ్‌ మెటల్ అవార్డును దక్కించుకోగా 'జుడాస్‌ అండ్‌ ది బ్లాక్‌ మిస్సయా' చిత్రంలో నటించిన డానియెల్‌ కలువకోయాకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. మిగిలిన విభాగాల్లో విజేతలను ప్రకటిస్తూ వస్తున్నారు. వారి వివరాలు...
 
ఉత్తమ చిత్రం : నోమడ్‌ల్యాండ్ 
ఉత్తమ డైరెక్టర్‌: కోవ్లీ చావ్‌(నో మ్యాడ్‌ లాండ్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఎరిక్‌(మ్యాంక)
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఎమరాల్డ్ ఫెనెల్‌(ప్రామిసంగ్‌ యంగ్‌ ఉమెన్‌)
ఉత్తమ సౌండ్‌:  సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్‌ ఫిల్మ్‌:  అనదర్‌ రౌండ్‌(డెన్మార్క్‌)
ఉత్తమ సహాయ నటుడు:  డానియొల్‌ కలువోయా(జూడాస్‌ అండ్‌ ది బ్లాక్‌ మిస్సయ్యా)
ఉత్తమ సహాయ నటి:  యున్‌ యా జంగ్‌(మినారి)
ఉత్తమ అడాప్‌టెడ్‌ స్క్రీన్‌ ప్లే: క్రిస్టోఫర్‌ హామ్టన్‌, ఫ్లొరియరన్‌ జెల్లర్‌(ది ఫాదర్‌)
ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: సెర్హియో లోఫెజ్‌, మియానీల్‌, జమికా విల్సన్‌(మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: అన్‌రాత్‌(మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)
ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పీట్‌ డాక్టర్‌, దానా మరీ(సోల్‌
ఉత్తమ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: మార్టిన్‌ డెస్మండ్‌ రాయ్‌(టూ డిస్టెంట్‌ స్ట్రేంజర్స్‌)
ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: మైకల్‌ గ్రోవియర్‌(ఇఫ్‌ ఎనిథింగ్‌ హ్యాపెన్‌ ఐ లవ్‌ యూ)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌: అంథోని(కలెక్టివ్‌)
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌:  అండ్రూ జాక్సన్‌, డేవిడ్‌ లీ(టెనెట్‌)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: డొనాల్డ్‌ బర్ట్‌(మ్యాంక్‌)
ఉత్తమ డాక్యమెంటరీ ఫీచర్‌: పిపా, జేమ్స్‌ రీడ్‌, క్రేగ్‌ ఫాస్టర్‌(మై అక్టోపస్‌ టీచర్‌)