థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు
Srinu, Pradeep Machiraju, Deepika Pilli
హీరో ప్రదీప్ మాచిరాజు లేటెస్ట్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం చేశారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటించింది. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ప్రదీప్ పలు విషయాలు తెలిపారు.
హీరో ప్రదీప్ మాట్లాడుతూ, మైత్రి శశి గారు మా టీం కి బిగ్గెస్ట్ స్ట్రెంత్. మా బ్యానర్ లో ఫస్ట్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రిలీజ్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రీమియర్స్ నుంచి సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆడియన్స్ థియేటర్స్ లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది. థియేటర్స్ నుంచి బయటికి వస్తున్న ప్రతి ఒక్కరు ఫేస్ లో స్మైల్ ఉంది. ఇంత మంచి కథని తీసుకొచ్చిన మా డైరెక్టర్ నితిన్ భరత్ కి థాంక్యూ. ఇది బ్యూటిఫుల్ జర్నీ. మమ్మల్ని నమ్మి థియేటర్స్ కొచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు థాంక్యూ సో మచ్.
సత్య, శ్రీను ఈ సినిమాని వారి భుజాల మీద వేసుకుని నడిపించారు. ఆడియన్స్ ఇంతలా నవ్వుతున్నారంటే దానికి ముఖ్య కారణం సత్య అండ్ శ్రీను వాళ్ళు పెట్టిన ఇంట్రెస్ట్ ఎనర్జీ. సత్యతో త్రూ అవుట్ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. బ్రహ్మానందం కి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే. మేము అడగగానే చాలా పెద్ద మనసుతో ఆయన ఒప్పుకుని సినిమా చేశారు. ఆయన ఎంట్రీతో థియేటర్ దద్దరిల్లింది. ఆయన కాంట్రిబ్యూషన్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లింది. బ్రహ్మాజీ గారు పాన్ ఇండియా ప్రభాకర్ గా అదరగొట్టారు.
అలాగే మా బావగారికి పాత్రలో చేసిన వెన్నెల కిషోర్ గారికి థాంక్యు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. రధన్ లవ్లీ ఆల్బమ్ ఇచ్చారు. మాకు పాట రాసిన ఆస్కార్ విజేత చంద్రబోస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో నటిస్తూ ఎడిటింగ్ చేసిన పీకే కి థాంక్యూ. రాజా గా దీపిక అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. శేఖర్ మాస్టర్ ఒక పెద్ద సినిమా పాట లాగా ఈ సినిమాకి కొరియోగ్రఫీ అందించారు. రఘు మాస్టర్ గారు కూడా బ్యూటిఫుల్ సాంగ్ చేశారు. ఈ సినిమాతో చాలామంది డెబ్యూ చేశారు. వాళ్లందరి టాలెంట్ ని మీరు స్క్రీన్ పై చూడ్డం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమాను చూసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు . ప్రేక్షకులు ఇచ్చిన ధైర్యంతో మేము ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాం.
మహేష్ బాబు గారు ఇచ్చిన స్టార్ట్ తో ఈ సినిమా ప్రమోషన్స్ ని మేము స్టార్ట్ చేశాను. లాస్ట్ బాల్ సిక్సర్ గా మా పెద్ది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు సినిమాకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. వారికి ధన్యవాదాలు. మాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యు. నాని అన్న ఒక వీడియో సెండ్ చేసి మాకు కంగ్రాట్స్ చెప్పడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మా యూనిట్ మొత్తానికి థాంక్యూ. ఈ సమ్మర్లో మంచి తెలుగు సినిమా చూసి నవ్వుకుందాం అని భావించే ప్రతి ఫ్యామిలీని మా సినిమాకి ఆహ్వానిస్తున్నాం'అన్నారు.
డైరెక్టర్ భరత్ మాట్లాడుతూ.. ఆడియన్స్ తో కలిసి సినిమా చూసాం. వాళ్ళు నవ్వుతుంటే అసలైన కిక్ వచ్చింది. ఈ సినిమా ఏడాదిన్నర పాటు కష్టపడడం. ఆ కష్టానికి ఫలితం నిన్న చూసుకున్నాం.డే వన్ నుంచి క్లీన్ కామెడీతో ఫ్యామిలీస్ అందరినీ నవ్విస్తామని చెప్పాం. అది చేశాను. థాంక్యూ'అన్నారు.