శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 నవంబరు 2017 (14:46 IST)

'పద్మావతి' మంటలు : తలలునరకం కానీ ఉరి తీసుకుంటాం...

బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు కూడా సర్టిఫికేట్ కూడా మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోంది. అలాగే, రాజ్‌పుత్ కర్ణిసేన ఈ చిత్రం విడుదలను తీవ్రంగా

బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు కూడా సర్టిఫికేట్ కూడా మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోంది. అలాగే, రాజ్‌పుత్ కర్ణిసేన ఈ చిత్రం విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్‌ జైపూర్‌ పట్టణంలోని నహర్‌ఘడ్‌ కోటలో ఈ బలవన్మరణం జరిగింది. "తాము తలలు నరకం - ఉరి తీసుకుంటాం" అని కోట గోడలపై రాసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
మరోవైపు, చిత్తోర్‌గఢ్ కోటలోని పద్మినీ మహల్ ముందున్న ఓ పురాతన శిలా ఫలకాన్ని ఆర్కియాలజీ విభాగం అధికారులు ఇప్పుడు చడీచప్పుడు లేకుండా మూసివేశారు. ఈ శిలాఫలకం మీద మొగల్ రాజు అల్లాఉద్దీన్ ఖిల్జీ, స్వయంగా రాణి పద్మావతిని చూశాడని ఉండటమే ఇందుకు కారణంగా ఉంది. ఈ శిలా ఫలకం తమ మనోభావాలను దెబ్బతీస్తోందని, దీన్ని ధ్వంసం చేస్తామని శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన హెచ్చరించిన నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగవచ్చన్న అనుమానంతో ఈ ఫలకాన్ని మూసి వేసినట్టు అధికారులు వెల్లడించారు.