సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 25 నవంబరు 2017 (16:42 IST)

నీ బాడీలో ఏ పార్ట్ బాగా అందంగా వుంటుంది? దీపికా పదుకునేకు ప్రశ్న

'పద్మావతి' చిత్రం వివాదాస్పదం కావడంతో ఇప్పుడు దీపికా పదుకునెకు సంబంధించిన పాత వీడియోలను బయటకు తీసి దుమ్ము దులుపుతున్నారు. బాలీవుడ్ సెక్సీస్టార్ రాఖీసావంత్ ఆమధ్య దీపికా పదుకునెతో చిట్ చాట్ చేసింది. ఇందులో ఆమెకు ఓ ప్రశ్న సంధించింది. నీ బాడీలో ఏ పార్ట్

'పద్మావతి' చిత్రం వివాదాస్పదం కావడంతో ఇప్పుడు దీపికా పదుకునెకు సంబంధించిన పాత వీడియోలను బయటకు తీసి దుమ్ము దులుపుతున్నారు. బాలీవుడ్ సెక్సీస్టార్ రాఖీసావంత్ ఆమధ్య దీపికా పదుకునెతో చిట్ చాట్ చేసింది. ఇందులో ఆమెకు ఓ ప్రశ్న సంధించింది. నీ బాడీలో ఏ పార్ట్ బాగా అందంగా వుంటుంది, దేన్ని బాగా చూపించేందుకు ఇష్టపడతావు అంటూ అడిగింది. 
 
ఈ ప్రశ్నకు దీపికా ఎంతమాత్రం తడుముకోకుండా... నా నవ్వు అనేసింది. అదేంటి... నవ్వు నీ బాడీలో పార్టా? అదెలా అని అడిగేసరికి, నేను నవ్వేటపుడు నా నాలుక, పళ్లు కనబడతాయి, నా బుగ్గపై సొట్ట పడుతుంది.. ఇదంతా అందమైన భాగమే అంటూ తెలివిగా సమాధానం చెప్పింది. మొత్తమ్మీద ఏదో రాబట్టాలని అడిగిన రాఖీ సావంత్ కు ఇలా షాకింగ్ సమాధానం చెప్పింది దీపికా పదుకునె. ఆ వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.